లిఫ్ట్‌ కూలి నలుగురు కూలీలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో ఒక ప్రైవేటు పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్