నెలాఖరులోగా వారికి ఉచిత చేప పిల్లల పంపిణీ: మంత్రి వాకిటి శ్రీహరి

TG: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సుమారు రూ. 123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం అమలుపై మంత్రి సోమవారం సాయంత్రం సచివాలయం నుంచి కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, పారదర్శకత పాటించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్