నెట్టింట అవుతున్న ఓ వీడియోలో ఒక కప్ప బతికి ఉన్న పామును మింగిపోతూ కనిపించింది. సోషల్ మీడియాలో @TheeDarkCircle షేర్ చేసిన 29 సెకన్ల వీడియోలో, పాము సగం కప్ప నోటి లోపల, తోక భాగం బయటగా ఉంది. కప్ప బలంగా పట్టుకుని, పాము బయటకు రాకుండా చేసింది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. వందల మంది లైక్‌లు రియాక్షన్లు ఇచ్చారు. కలియుగం అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.