AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 7వ తేదీన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పౌర్ణమి గరుడ సేవతో పాటు, అదే రోజు నిర్వహించాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. గ్రహణం సమయంలో ఆలయ తలుపులను మూసి ఉంచుతారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.