TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్ఖాన్పేటలో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఫ్యూచర్‌సిటీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసమే ఈ ఫ్యూచర్ సిటీ అని, పదేళ్లలో న్యూయార్క్‌ను మరిపించే నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తామని, ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామనిపేర్కొన్నారు.