మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం అమ్మపురం గుట్టల్లో వెలిసిన కురుమూర్తి స్వామిని శనివారం వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘా రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డిలు దర్శించుకున్నారు. కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. సాక్షాత్తు తిరుపతి వేంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.