మహబూబ్ నగర్: రిక్షా పుల్లర్ అదృశ్యం

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్ల పహాడ్ కు చెందిన రిక్షా పుల్లర్ పిచ్చకుంట్ల ఆంజనేయులు అద్దె రిక్షా తొక్కడానికి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్టోబర్ 18న అదృశ్యమయ్యారు. ప్రతిరోజూ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి జీవనోపాధి పొంది తిరిగి వచ్చే ఆంజనేయులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం భార్య పిచ్చకుంట్ల లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్