కల్వకుర్తి: దంచికొట్టిన వర్షం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం వాతావరణ మార్పుల కారణంగా భారీ వర్షం కురిసి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కురుస్తున్న వర్షాల వల్ల చేతికందిన పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్