నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి కోరుతూ దక్షిణ మధ్య రైల్వే బోర్డుకు లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఈ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, బుధవారం కల్వకుర్తి నుంచి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మీదుగా దేవరకొండ, మాచర్లకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.