నారాయణపేట పట్టణంలో శుక్రవారం అయ్యప్పస్వామి 33వ మహా పడి పూజ గురు స్వాముల వైభవంగా నిర్వహించారు. బారంభావి నుండి బసవన్న ఆలయం వరకు కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గణపతిపూజ, మెట్ల పూజ, అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గురు స్వాములను శాలువాతో సన్మానించారు. స్వాములకు, భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలదారుల, ప్రజలు పాల్గొన్నారు.