నారాయణపేట: సర్వ ధర్మ సమ్మేళనం గోడ పత్రిక విడుదల

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలోని దర్గాలో నవంబర్ 7న 24వ సర్వ ధర్మ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సజ్జద దర్గా పీఠాధిపతి సయ్యద్ షా జాలల్ హుస్సేని తెలిపారు. సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికను బుధవారం దర్గాలో ఆవిష్కరించారు. దర్గా ఉర్సు సందర్భంగా జరిగే సమ్మేళనంలో అన్ని మతాలకు చెందిన పెద్దలు, గురువులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్