వనపర్తి: భర్త హత్య.. భార్య, ప్రియుడు అరెస్ట్

వనపర్తి జిల్లాలో భర్తను హత్య చేసిన కేసులో భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి పట్టణానికి చెందిన కురుమూర్తి భార్య నాగమణి, మెట్ పల్లికి చెందిన శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్త కురుమూర్తిని హత్య చేసి, మృతదేహాన్ని శ్రీశైలం డ్యాంలో పడేశారు. మృతుడి సోదరి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్