AP: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మూడోరోజు గణేశుడిని రూ.77,77,777 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.