సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ముఠా.. రూ.15 కోట్లు కొల్లగొట్టారు

TG: నిజామాబాద్ జిల్లా పోలీసులు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను అరెస్ట్ చేశారు. మహ్మద్ మెయిస్ ఖాన్, సయ్యద్ అహ్మద్ హసన్ అనే వీరిద్దరూ క్రిప్టో కరెన్సీ, ఫిక్సడ్ డిపాజిట్లు, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వంటి పేర్లతో 120 మందిని మోసం చేసి సుమారు రూ.15 కోట్లు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ఒక టీచర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, వీరి బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంలో వాజిద్ హుస్సేన్ అనే మరో వ్యక్తి సహకరించాడని పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్