వారికి గ్యాస్ సబ్సిడీ పథకం నిలిపివేత

గృహావసరాలకు వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు ప్రతియేటా మార్చి 31 లోపు ఈ- కేవైసీ వివరాలు సమర్పించాలని ఇప్పటికే నిబంధన ఉంది. వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపి వేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా తేల్చి చెప్పింది. ప్రతియేటా ఒకసారి ఈ- కేవైసీ ఇవ్వకపోతే... ఏడాదిలో వారికిచ్చే 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్