ఆసియా కప్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించింది. సెప్టెంబర్ 10న యూఏఈతో, 14న పాకిస్థాన్‌తో, 19న ఒమన్‌తో భారత్ గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లలో జోష్ నింపారు. "భారత్ తరఫున ఆడటం అంటే కొత్త అవకాశమే. ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ క్రికెటర్‌గా ఎదగాలి" అని గంభీర్ సూచించినట్లు ఆల్‌రౌండర్ శివమ్ దూబె వెల్లడించాడు. BCCI ఈ వీడియోను పంచుకుంది.