బాలిక కిడ్నాప్.. ఆరు నెలలుగా బంధించి అత్యాచారం

యూపీలోని బదోహి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆరు నెలలుగా బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 22న బాలిక అదృశ్యమైందని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్ 26న ప్రయాగ్రాజ్ లోని సంగం రైల్వే స్టేషన్ సమీపంలో బాలికను రక్షించారు. ఈ కేసులో ఆశిష్ కుమార్ సరోజ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్