కుండపోత వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 46.8 అడుగులకు, పోలవరం వద్ద 11.71 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అక్కడ శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, 6 SDRF బృందాలను సిద్ధం చేశారు. బాసరలో సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రధాన మార్గం వరకు వరద వెళ్లింది.