అందుబాటులోకి EPFO పాస్‌బుక్‌ లైట్‌

EPFO పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. సేవలను సులభతరం చేసేందుకు 'పాస్‌బుక్ లైట్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఖాతాదారులు లాగిన్ అవ్వకుండానే తమ పీఎఫ్ ఖాతా వివరాలను, జమ అయిన మొత్తాన్ని, కాంట్రిబ్యూషన్, విత్ డ్రా వివరాలను ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఇది సభ్యుల సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, పీఎఫ్ పోర్టల్‌పై భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ బదిలీ స్థితిని కూడా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు.

సంబంధిత పోస్ట్