రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే స్టేషన్స్‌లో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిళ్ల ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన జీఎస్టీ ప్రయోజనాన్ని వినియోగదార్లకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.15గా ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌ను రూ.14కు, రూ.10గా ఉన్న 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.9కు విక్రయించనుంది. సవరించిన ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.