AP: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో భక్తుల ప్రయాణానికి APSRTC ద్వారా ఉచిత బస్సు సర్వీసులను తీసుకొచ్చినట్లు TTD దేవస్థానం అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ భక్తులను ఉచితంగా చేరవేస్తాయని వెల్లడించారు.