గుడ్‌ న్యూస్.. నవంబర్‌లో కొత్త e-Aadhaar మొబైల్ యాప్‌

కేంద్ర ప్రభుత్వం ఆధార్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. UIDAI 2025 నవంబర్‌లో కొత్త e-Aadhaar మొబైల్ యాప్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న m-ఆధార్ యాప్‌లో అడ్రస్ అప్‌డేట్, డౌన్‌లోడ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా, కొత్త యాప్‌లో పేరు, అడ్రస్, జన్మదిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఇంటి నుంచే AI, ఫేస్ ID ఆధారంగా మార్చుకునే వీలుంటుంది. OTP వెరిఫికేషన్‌తో ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ యాప్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత పోస్ట్