గుడ్‌ న్యూస్.. తగ్గిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు గుడ్ న్యూస్‌. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్‌ల ధరలను తగ్గించింది. సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 350 సీసీ ఇంజిన్‌ మోడళ్లపై జీఎస్టీ 28% నుంచి 18%కు తగ్గించడంతో క్లాసిక్‌ 350, హంటర్‌ 350, మెటోర్‌ 350 ధరలు రూ.22,000 వరకు తగ్గనున్నాయి. అయితే, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడళ్లపై 40% పన్ను వర్తించి ధరలు పెరగనున్నాయి.

సంబంధిత పోస్ట్