దసరా పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న డీఏను మరో 3 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రతి ఉద్యోగికి నెలకు సుమారు రూ.1,500 వరకు జీతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల 1.2 కోట్లకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశముంది.