AP: రైతులు పండించిన టమాటా పంటను కనీసం కిలో రూ.20 నుంచి రూ.25 చెల్లించి ప్రభుత్వమే మార్క్ ఫెడ్, ఇతర ఏజెన్సీలతో కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కనీసం ఈ ధరైనా లేకపోతే రైతులకు టమాటా పంట గిట్టుబాటు కాదని పేర్కొంది. కర్నూలు జిల్లా పత్తికొండ, తుగ్గలి, ఆస్పరి, దేవనకొండ, తదితర ప్రాంతాల్లో టమాటాను పండించిన రైతులు కిలో రూ.1 నుంచి రూ.2లకే అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.