అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ మరోసారి మొదలైంది. ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే రెండు బిల్లులను సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు.