స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2025 సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు పలు ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే డీల్స్, రాయితీలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో మొబైల్స్, యాక్ససరీలపై 40 శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఇక ఈ సేల్ ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.