TG: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. గ్రూప్-2 ఫలితాలు రేపు విడుదల చేసేందుకు TGPSC సిద్ధమైనట్లు తెలుస్తోంది. 783 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది. పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నాలుగు విడతల్లో అభ్యర్థులను పిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్-2 పోస్టులకు 2024 డిసెంబర్ లో రాటపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.