జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో టీవీ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం.. 32 అంగుళాల టీవీల జీఎస్టీ రేటు 28% నుంచి 18%కు తగ్గింది. దీంతో సోనీ, ఎల్‌జీ, పానాసోనిక్ వంటి బ్రాండ్లు స్క్రీన్ సైజ్, స్పెసిఫికేషన్‌ల ఆధారంగా ధరలు తగ్గనున్నాయి. ఉదాహరణకి, సోనీ 43” బ్రావియా 2 టీవీ ధర రూ.59,900 నుంచి రూ.54,900కి, ఎల్‌జీ 65” టీవీ రూ.71,890 నుంచి రూ.68,490కి తగ్గనుంది.