కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 12, 28 శాతం శ్లాబులను తొలగించింది. ఈ మార్పుల వల్ల చాలా వస్తువుల ధరలు తగ్గగా, కొన్ని ఉత్పత్తులు మాత్రం అధిక పన్నుల శ్లాబులోకి చేరాయి. ముఖ్యంగా సిగరెట్లపై జీఎస్టీ 40 శాతానికి పెరిగింది. ఈ పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఏయే ఉత్పత్తులపై ఈ మార్పులు వర్తిస్తాయో వివరాలు తెలియాల్సి ఉంది.