అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ హెచ్1బీ వీసాపై చేసిన ప్రకటన గందరగోళం సృష్టించగా, శ్వేత సౌధం క్లారిటీ ఇచ్చింది. వీసాపై లక్ష డాలర్ల వన్‌టైమ్ ఫీజు అమలు సెప్టెంబర్ 21 అర్థరాత్రి 12.01 (అమెరికా సమయం) నుంచి ప్రారంభమైందని, ఇది కొత్తగా దాఖలు చేసే పిటిషన్లకే వర్తిస్తుందని USCIS స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమోదం పొందినవి, చెల్లుబాటులో ఉన్న వీసాలు ప్రభావితం కావని తెలిపింది.