హరిముకుంద పండా.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

AP: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన తర్వాత నిర్వాహకుడు హరిముకుంద పండా మరోసారి వార్తల్లో నిలిచారు. పండా ఒడిశా రాజ కుటుంబీకులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థిరపడ్డారు. పండా కుటుంంబానికి కాశీబుగ్గలో వందెకరాల భూమి ఉంది. కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న తోటలో విజయ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఆలయం కట్టారు. ఈ ఆలయం నిర్మించడానికి దాతల సహకారం కూడా తీసుకోలేదు. సొంత డబ్బులతోనే ఆలయాన్ని నిర్మించారు.

సంబంధిత పోస్ట్