ముంబైలోని బాంద్రాలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులు ఓ విలాసవంతమైన బంగ్లాను నిర్మించుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. సుమారు రూ.250 కోట్ల విలువైన ఈ ఆరు అంతస్తుల భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉందని, నెల రోజుల్లో ఇంటీరియర్ పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. నవంబర్ 8న తమ కూతురు రాహా మూడో పుట్టినరోజు వేడుకల్ని ఈ కొత్త నివాసంలోనే చేయాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం.