TG: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శుక్రవారం పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఒక వృద్ధురాలి పుస్తెలతాడును కొట్టేసి పరారయ్యాడు. ధర్మారం మండల కేంద్రానికి చెందిన బుదారపు శంకరమ్మ (70)ను గుర్తుతెలియని వ్యక్తి పంచాయతీ కార్యదర్శిగా నమ్మించి, పుస్తెలతాడు తీసిస్తే పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఆమె పుస్తెలతాడు తీసి ఇవ్వగానే, డబ్బులు తెస్తానని వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.