బెంగళూరులో 32 ఏళ్ల మహిళను ప్రైవేటు వీడియోలతో బెదిరించి 17 లక్షలు వసూలు చేసిన స్వరూప్ గౌడపై కేసు నమోదైంది. 2022లో ఫేస్‌బుక్ పరిచయంతో మొదలైన సంబంధం తర్వాత ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకపోగా, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడు. మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను గౌడ కొట్టినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.