సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక డ్రైవర్ తన ఆటోను లగ్జరీ కారుగా మార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అందులో ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్ వంటి సౌకర్యాలు కల్పించాడు. ఆటోలోని సీట్లను స్లీపింగ్ బెడ్‌లుగా మార్చాడు. వాహనం రెండు వైపులా 4 గేట్లతో సెటప్ చేశాడు. తరువాత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక సీట్లకు పవర్ విండోస్ ఏర్పాటు చేశాడు.అలాగే, మీరు ఎక్కువసేపు ఆ ఆటోలో ప్రయాణిస్తుంటే, వెనుక సీటును బెడ్‌గా మార్చుకునే వెసులుబాటు కల్పించాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.