ప్రేమను తిరస్కరించిందని యువతిని చంపేశాడు

కర్ణాటలోని బెంగళూరులోని సోమదేవనహళ్లిలో దారుణ ఘటన జరిగింది. యామిని ప్రియ (20) అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ విఘ్నేష్ వెంటపడేవాడు. ఆమె తన ప్రేమను ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. కాలేజీకి వెళ్లి గురువారం ఆమె తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ దగ్గర అడ్డుకుని విఘ్నేష్ దాడి చేశాడు. ఆమె తేరుకునేలోపే నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెుస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్