అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ 10న దారుణ హత్యకు గురయ్యారు. డల్లాస్ నగరంలోని మోటల్ నిర్వహిస్తున్న చంద్ర నాగమల్లయ్య(50)ను కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి కత్తితో తల నరికి అత్యంత కిరారతంగా హత్య చేశాడు. అనంతరం తెగిపోయిన తలను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. విరిగిపోయిన వాషింగ్ మెషీన్ వాడద్దని ట్రాన్స్‌లేటర్ ద్వారా మార్టినెజ్‌కు చెప్పించడంతో అతడు కలత చెంది ఈ హత్యకు పాల్పడ్డాడు.