AP: ప్రాణ స్నేహితుడిని ఆవేశంతో కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో చోటు చేసుకుంది. వెంకటగిరి గ్రామానికి చెందిన బి.గిరి (23) దారుణ హత్యకు గురయ్యాడు. గిరి తల్లిదండ్రులు మద్దిలేటి, గిడ్డమ్మలు చనిపోయారు. గిరి స్నేహితుడు మౌలాలీ కర్నూలులో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. శనివారం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. వీరి మధ్య గొడవ జరగగా.. మౌలాలీ తన దగ్గరున్న కత్తితో గొంతు కోసి చంపాడు.