భార్యను చంపి గొయ్యిలో పాతిపెట్టాడు.. ఆపై

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హింగన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని సంచిలో కుక్కి ఇంటి సమీపంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. అనంతరం తన భార్య కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్ ఆఫ్‌ వచ్చింది. దీంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా పరిసరాల్లో దుర్వాసన వచ్చింది. ఈ మేరకు ఆ ఇంటి సమీపంలో తవ్వి చూడగా మహిళ మృతదేహం బయటపడింది.

సంబంధిత పోస్ట్