వర్షాకాలంలో వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడివేడిగా ఉండే బజ్జీలు, సమోసాలు, ఫ్రైడ్ ఐటమ్స్ వంటివి జీర్ణం కాక గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకు దారితీస్తాయని, బయటి ఆహారాలు, స్ట్రీట్ ఫుడ్స్ వల్ల విరేచనాలు, పచ్చకామెర్లు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలని, తద్వారా వర్షాల టైంలో అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.