TG: స్థానిక సంస్థల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే GOపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. 50% మించి రిజర్వేషన్లు ఉండరాదని రాజ్యాంగం చెబుతున్నందున BCలకే 42% ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. GO గెజిట్ కానప్పుడు ఆందోళన ఎందుకని జడ్జి పిటిషనర్లను అడిగారు. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.