హృదయవిదారక దృశ్యాలు.. మిన్నంటిన మృతుల కుటుంబసభ్యుల రోదనలు (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా.. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బస్సును ఢీకొట్టి టిప్పర్‌లోని కంకర ప్రయాణికులపై పడటంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు. దీంతో చనిపోయిన తమవారిని తలుచుకుంటూ ఆస్పత్రుల వద్ద కుటుంబ సభ్యులు పడిగాపులుగాస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్