రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాలల్లో భారీ వర్షాలు: IMD

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి గురువారం ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రా తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణకు బుధవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. అలాగే రాబోయే మూడు రోజులు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకుపైగా ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్