నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేశారు.