ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం చమేలీలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలో ఏడుగురు కొట్టుకుపోయారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కారులో ఎంపీ అనిల్ బలూని వెళ్తుండగా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో క్షణాల్లో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.