భారీ వర్షాలు.. వాగులో చిక్కుకున్న కార్మికులు (వీడియో)

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు వాగు వరదలో చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్‌పై ఎక్కి కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. అలాగే మెదక్ జిల్లా ధూప్‌సింగ్‌ తండా నీట మునిగింది. ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరడంతో తండా వాసులు భవనాల పైకెక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్