స్టార్ హీరో అజిత్ కుమార్ పేరు వినగానే డేర్, గట్స్, అడ్వెంచర్ గుర్తొస్తాయి. రజనీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అతడికే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. సినిమాల్లో హీరోగా, నిజ జీవితంలో స్పోర్ట్స్ మేన్‌గా అదరగొడుతున్న అజిత్, 54 ఏళ్ల వయసులో కూడా గంటకు 250–300 కి.మీ స్పీడుతో రేసింగ్‌లో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఆయన రోడ్డుపై 250 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.