జ‌గ‌న్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన హీరో అల్లు అర్జున్‌

నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ మృతిపై మాజీ సీఎం జ‌గ‌న్‌ శ‌నివారం 'ఎక్స్' వేదిక‌గా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు జ‌గ‌న్ పేర్కొన్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. దీనిపై 'ఎక్స్' వేదిక‌గా హీరో అల్లు అర్జున్ స్పందించారు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్‌ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్‌ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్