కన్నడ సిని నటుడు హేమంత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రిచ్చి మూవీ హీరోయిన్ ఆరోపణలు చేశారు. 2022లో సినిమా ప్రమోషన్ల పేరుతో నటిని ముంబైకి తీసుకెళ్లిన హేమంత్, అక్కడ ఆమెకు కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి, మత్తులో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.